Spiritual

మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి

భక్తులకు ప్రత్యేక కానుక

మహాకుంభ మేళాకు హాజరయ్యే భక్తులకు ఎయిర్ ఇండియా ప్రత్యేక కానుక ఇచ్చింది. ముఖ్య నగరాల నుంచి ప్రత్యేక విమానాలు సిద్ధం చేసింది.

ఢిల్లీ నుండి..

ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు రోజువారీ విమానాలను ప్రారంభించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.

ఎప్పుడు నడుస్తాయి?

ఎయిర్ ఇండియా ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్‌ల మధ్య రోజువారీ విమానాలు జనవరి 25 నుండి ఫిబ్రవరి 28 వరకు తాత్కాలికంగా నడుస్తాయి.

విమానాల షెడ్యూల్ ఇది

జనవరి 25 నుంచి 31 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ AI2843 విమానం తిరుగుతుంది. మధ్యాహ్నం 2:10కి బయలుదేరి 3:20కి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5:10కి ఢిల్లీ చేరుకుంటుంది.

ఛార్జీలు ఎంత?

ఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు రూ.10,000 - 15,000 మధ్య ఉంటుంది. అహ్మదాబాద్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు రూ.19,000 - 35,000, చెన్నై నుండి ప్రయాగ్‌రాజ్‌కు రూ.20,000 - రూ.33,000 మధ్య ఉంటుంది.

ఎక్కడ బుక్ చేసుకోవాలి?

ప్రయాణీకులు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

5 కోట్ల మంది స్నానం

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళాలో రెండు రోజుల్లోనే 5 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానం చేశారు.

40-45 కోట్ల మంది హాజరు

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమానికి 40 నుండి 45 కోట్ల మంది హాజరవుతారని అంచనా.

నాగ సాధువుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారా?

ఈ ప్లేట్లల్లో అస్సలు తినొద్దు

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లను మాత్రం ఇంటికి పిలవకూడదు

మకర సంక్రాంతి కి అస్సలు చేయకూడని పనులు ఇవే