Spiritual

దీపావళికి లక్ష్మీ పూజలో ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా?

దీపావళి 2024 ఎప్పుడు?

ఈ ఏడాది దీపావళి పండగ అక్టోబర్ 31, గురువారం వచ్చింది. సాయంత్రం లక్ష్మీ పూజ సమయంలో దీపాలు కూడా వెలిగిస్తారు. ఎన్ని దీపాలు వెలిగించాలి? వాటి సంఖ్య ఇక్కడ తెలుసుకోండి?

దీపాలు వెలిగించడానికి కారణం

త్రేతాయుగంలో రాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారట. అప్పటి నుంచి దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.

ఎన్ని దీపాలు వెలిగించాలి?

దీపావళి సాయంత్రం చాలా దీపాలు వెలిగిస్తారు. కాని లక్ష్మీ పూజలో ఎన్ని దీపాలు వెలిగించాలో ఏ గ్రంథంలోనూ ప్రస్తావించలేదు.

బేసి సంఖ్యలో దీపాలు

లక్ష్మీ పూజలో దీపాల సంఖ్య 11, 21, 31 లేదా 51 వంటి బేసి సంఖ్యలో ఉండాలని పండితులు చెబుతున్నారు. లేదా కనీసం 5 ఉండాలట.

దీన్ని గుర్తుంచుకోండి

10, 20 లేదా 30 వంటి సంఖ్యలో దీపాలను ఎప్పుడూ వెలిగించకూడదు. ఎందుకంటే వీటి చివరి అంకె సున్నా వస్తుంది. ఇది మంచిది కాదని ప్రజలు నమ్ముతారు.

సంఖ్య 1 శుభసూచకం

హిందూ మతంలో సంఖ్య 1 శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు 51 లేదా 101 రూపాయలు ఇస్తారు. లక్ష్మీ పూజలో దీపాలకూ ఇది వర్తిస్తుంది.

దీపావళికి లక్ష్మీ పూజ చేసిన తర్వాత విగ్రహం ఏం చేయాలో తెలుసా?

దసరా రోజు ఈ పక్షిచూస్తే మీకు శుభం జరుగుతుంది

దసరా వేళ ఇవి ఇంటికి తెస్తే అదృష్టమే

సొంత చెల్లే రావణుడిని సర్వనాశనమైపోమని శపించింది: ఎందుకో తెలుసా