Spiritual

సొంత చెల్లే రావణుడిని సర్వనాశనమైపోమని శపించింది: ఎందుకో తెలుసా

రావణుడి మరణానికి కారణం

అసలు రావణుడి మరణానికి కారణం సీతను అపహరించడం అనుకుంటారు. అయితే ఆయన్ను ఎంతో మంది శపించారు. అవన్నీ కలిసి రాముడి చేతిలో రావణుడు అంతమయ్యాడు. 

శపించిన వారి లిస్టు పెద్దదే

రావణుడిని శపించిన వారి లిస్టు పెద్దదే. పురాణాల ప్రకారం వేల సంవత్సరాలుగా ఆయన పలువురి శాపాలకు గురయ్యారు. రావణుడి శాపాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నంది రావణుడిని శపించాడు

ఒకసారి రావణుడు శివుడిని దర్శించుకోడానికి కైలాశానికి వెళ్ళినప్పుడు అక్కడ నంది రూపాన్ని చూసి రావణుడు నవ్వుతాడు. ఆ సమయంలో నంది రావణుడిని సర్వనాశనం చేస్తానని శపించాడు.

మాయ శపించింది

ఒకరోజు రావణుడు తన భార్య మండోదరి సోదరి మాయ దగ్గరికి వెళ్ళాడు. మాయ అందాన్ని చూసి రావణుడు లంకకు రమ్మంటాడు. ఒక స్త్రీ కారణంగానే నీ మరణం సంభవిస్తుందని కోపంతో మాయ శపించింది.

శ్రీరాముడి పూర్వీకులు శపించారు

పూర్వకాలంలో అయోధ్య రాజైన అనరణ్యుడికి రావణుడితో యుద్ధం జరిగింది. అందులో అతను మరణిస్తూ నా వంశంలో జన్మించిన ఒక యోధుడు నీ మరణానికి కారణమవుతాడని శపించాడు.

శూర్పణఖ కూడా..

రావణుడు తన సోదరి శూర్పణఖ భర్త విద్యుత్జిహ్వను చంపాడు. అప్పుడు శూర్పణఖ కూడా రావణుడిని నా కారణంగానే నీవు సర్వనాశనం అవుతాయని మనసులో శపించింది. అలాగే జరిగింది.

తపస్విని శపించింది

ఒకసారి రావణుడు తపస్సు చేసుకుంటున్న యువతిని బలవంతంగా పట్టుకున్నాడు. ఆ తపస్విని వెంటనే తన దేహాన్ని వదిలేస్తూ ఒక స్త్రీ కారణంగానే నీ మరణం సంభవిస్తుందని రావణుడిని శపించింది.

దసరా 2024: ఎవరెవరు రావణున్ని ఓడించారు?

రావణుడు రాక్షసుడా? బ్రాహ్మణుడా?: వంశవృక్షం ఇదిగో

ప్రేమ, బంధాలపై శ్రీకృష్ణుడి అద్భుతమైన బోధనలు

వినాయక చవితి 2024: ఏకదంతుడి గురించి 7 ఆసక్తికర విషయాలు