Spiritual

చాణక్య నీతి : విజయానికి అడ్డుగా నిలిచేవి ఇవే

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే వీటికి దూరంగా ఉండాలి.

కెరీర్, జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టంతో పాటు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.

వేటికి దూరంగా ఉండాలి?

చాణక్య నీతిలో ఆచార్య చాణక్య కొన్ని అలవాట్ల గురించి చెప్పారు. సక్సెస్ పాత్ ను సులభతరం చేసుకోవడానికి దేనికి దూరంగా ఉండాలో ఈ నీతి నేర్పుతుంది.

నెగిటివ్ ఆలోచనలు

నెగటివ్ ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సవాళ్లను ఎదుర్కోవడం కష్టతరం అవుతుంది. పాజిటివ్ గా ఆలోచించండి,  పుస్తకాలు చదవండి, పాజిటివ్ వ్యక్తులతో సమయం గడపండి.

సోమరితనం..

సోమరితనం సక్సెస్ కి అతి పెద్ద శత్రువు. పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న పనులుగా విభజించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, ఉత్సాహంగా ఉండండి.

అభద్రతా భావానికి దూరంగా ఉండండి

అభద్రతా భావం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటుంది. మీ బలం మీద నమ్మకం ఉంచండి, మీ బలహీనతలను అంగీకరించండి, ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

అత్యాశకు దూరంగా ఉండండి

అత్యాశ తప్పుడు దారుల్లో నడిపిస్తుంది. సక్సెస్ ను ఒక సాధనంగా భావించండి, లక్ష్యంగా కాదు.

కోపానికి దూరంగా ఉండండి

కోపం ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. సంబంధాలలో కూడా చిచ్చు పెడుతుంది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి.

అహంకారానికి దూరంగా ఉండండి

అహంకారం నేర్చుకోవడానికి, ఇతరుల మాటలు వినడానికి అడ్డుపడుతుంది. వినయంగా ఉండండి, ఇతరుల దృక్కోణాన్ని గౌరవించండి.

విజయానికి దారి

చాణక్య నీతి ప్రకారం మంచి అలవాట్లు, పాజిటివ్ దృక్పథమే సక్సెస్ కి కీలకం.

2025లో పెళ్లిళ్లకు శుభముహూర్తాలు

ఖాళీ చేతులతో ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు

వనవాసంలో సీతారాములు ఎన్ని ప్లేసుల్లో నివసించారో తెలుసా?

చాణక్యనీతి: గౌరవం కోల్పోకుండా క్షమాపణలు చెప్పేదెలా?