నైవేద్యం.. ముందు బొద్దింకలకు.. తర్వాతే బద్రీనాథుడికి. ఎందుకంటే?
Telugu
చార్ ధామ్‌లలో ఒకటి బద్రీనాథ్
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్ యాత్రలో బద్రీనాథ్ కూడా ఒకటి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనికి సంబంధించి అనేక ప్రత్యేక నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్నాయి.
Telugu
బొద్దింకలకు నైవేద్యం
బద్రీనాథ్ ఆలయంలో భగవంతుడికి నైవేద్యం సమర్పించే ముందు అనేక జంతువులకు నైవేద్యం సమర్పిస్తారు. వీటిలో బొద్దింకలు కూడా ఉన్నాయి. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజం.
Telugu
జోడు సాంగ్లా అంటే బొద్దింకలు
బొద్దింకలను ఉత్తరాఖండ్ స్థానిక భాషలో జోడు సాంగ్లా అంటారు. ప్రతిరోజూ మధ్యాహ్నం బద్రీనాథుడికి రాజభోగం సమర్పిస్తారు. దానికి ముందు బొద్దింకలకు నైవేద్యం సమర్పిస్తారు.
Telugu
అందుకే బొద్దింకలకు నైవేద్యం
బద్రీనాథ్ రాజభోగం స్వీకరించే ముందు అన్ని జీవులను తృప్తిపరుస్తారనే భక్తుల నమ్మకం. అందుకే ఇతర జంతువులతో పాటు బొద్దింకలకు కూడా నైవేద్యం సమర్పిస్తారు.
Telugu
ఏమి నైవేద్యం పెడతారు?
బద్రీనాథ్ ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం బొద్దింకలకు బియ్యం నైవేద్యంగా పెడతారు. దీన్ని తప్తకుండ్ దగ్గర గరుడ కుటీలో ఉంచుతారు. ఆ తర్వాతే భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తారు.
Telugu
ఈ జీవులకు కూడా నైవేద్యం
బద్రీనాథ్ ఆలయంలో బొద్దింకలతో పాటు ఆవులు, పక్షులకు కూడా నైవేద్యం సమర్పిస్తారు. ఈ సంప్రదాయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ప్రారంభించారట.