pregnancy & parenting
అసలు మీ పిల్లలు ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో మెల్లిగా అడిగి తెలుసుకోండి. దీన్ని బట్టి మీరు ఏం చేయాలో తెలుస్తుంది.
పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ రావాలంటే వారికి ఇంట్లో మంచి వాతావరణాన్ని కల్పించాలి. అలాగే చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యేలా చేయండి.
ఒత్తిడి, ఇతర సమస్యల వల్ల మీ పిల్లలు స్కూలుకు వెళ్లకపోవచ్చు. ఇలాంటి సమస్యలనే వారు ఎదుర్కొంటుంటే.. వారిని అర్థం చేసుకోండి. వారి సమస్యలను పరిష్కరించండి.
కొంతమంది పిల్లలు చదువంటే చాలా కష్టంగా భావిస్తారు. ఇలాంటి పిల్లలు చదవాలంటే వాళ్ల టీచర్ తో మాట్లాడి మంచి సలహాలు తీసుకోండి.
పిల్లలు చదువుకోవాలంటే వారికి మంచి అలవాట్లను నేర్పాలి. ప్రతి పేరెంట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పిస్తే వారిలో మంచి మార్పు వస్తుంది. బాగా చదువుకుంటారు.
పిల్లలకు ఒక్క చదవులోనే కాదు ఆటలు వంటి విషయాల్లోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారికి దేనిపై ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని ఎంకరేజ్ చేయలి. దీంతో వాళ్లలో నమ్మకం, నైపుణ్యాలు పెరుగుతాయి.
ఎన్ని చేసినా పిల్లలు స్కూల్ కు వెళ్లడానికి ఇబ్బంది పడినా, ఒత్తిడికి గురైనా వెంటనే వాళ్ల టీచర్ తో మాట్లాడండి.
పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని వారిపై ఒత్తిడి మాత్రం తేకూడదు. దీనివల్ల పిల్లలు మానసికంగా క్రుంగిపోతారు. అందుకే పిల్లలు స్నేహపూర్వకంగా, ప్రేమగా ఉండండి.