pregnancy & parenting
పిల్లలకు చాలా విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది. పిల్లలకు కోపం రాగానే చాలా మంది పేరెంట్స్ నవ్వేస్తారు. కానీ, ఇలా చేస్తే, పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది.
పిల్లలు కోపంగా ఉన్నారని మీరు నవ్వితే వాళ్ళు ఒంటరిగా భావిస్తారు. వెంటనే కోపానికి కారణం అడిగి మాట్లాడండి.
పిల్లలు మారాం చేస్తే, నవ్వకండి, అరవకండి. ప్రశాంతంగా సమస్య ఏంటో అడగండి.
పిల్లల సమస్య విని, వాళ్ళని నిందించకండి. సమస్యకు పరిష్కారం చూపించండి.
పిల్లలు మారాం చేస్తే ఒంటరిగా వదిలేయకండి. వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళ బాధను పంచుకోండి.
పిల్లలు స్నేహితులతో తేలిగ్గా మాట్లాడుకుంటారు. స్నేహితుడిలా సలహా ఇవ్వండి.