Lifestyle
వెలగ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు వెలగపండు. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
అల్సర్ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా వెలగపండును రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారిలో కూడా వెలగపండు ఉపయోగపడుతుంది. ఇందులోని ఐరన్ కంటెంట్ రక్త హీనతను తగ్గించడంతో సహాయపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారు వెలగపండును జ్యూస్ రూపంలో తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
పురుషుల్లో సంతాన లేమి సమస్యలను దూరం చేయడంలో వెలగపండు కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వెలగపండు గుజ్జు వీర్య వృద్ధికి తోడ్పడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టే విషయాలు ఇవే
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి
ఉదయాన్నే పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలి?
చాణక్య నీతి: మీకు నిజమైన స్నేహితులు, బంధువులు ఎవరో తెలుసా?