Lifestyle
మహిళలు గర్భం దాల్చిన తర్వాత తీసుకునే ఆహారం మొదలు జీవనశైలి వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
గర్భిణీలు దూర ప్రయాణం చేయకూడదని నిపుణులు చెబుతుంటారు. ఈ కారణంగా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని సూచిస్తుంటారు.
గర్భిణీల విషయంలో పెద్దలు కూడా కొన్ని విషయాలు చెప్తుంటారు. గ్రంధాల్లో కూడా ఇందుకు సంబంధించిన విషయాలను సవివరంగా తెలిపారు.
గర్భిణీలు రాత్రి పూట బయటకు వెళ్లకూడదని, చెట్ల కిందికి వెళ్లడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదుని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీలు నదుల వద్దకు వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. నదుల్లో మరణించిన వారు అస్తికలను కలుపుతారు. ఈ కారణంగానే గర్భిణీలు నదుల వద్దకు వెళ్లకూడదని చెబుతుంటారు.
నదుల వద్ద కొన్ని ప్రతికూల శక్తులు ఉంటాయని పెద్దలు అంటారు. అందుకే గర్భిణీలు నదుల వద్దకు వెల్లకూడదని పెద్దలు చెబుతుంటారు.
నదీ ప్రవాహక ప్రాంతాల్లో మురికి ఎక్కువగా ఉంటుంది. పేరుకు పోయిన చెత్తాచెదరం కారణంగా గర్భిణీల్లో ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా నదీ ప్రవాహక ప్రాంతాల్లో భూమి నాచుతో నిండి ఉంటుంది. ఈ కారణంగా గర్భిణీలు జారిపడే అవకాశం ఉంటుంది. అందుకే వెళ్లొద్దని చెబుతుంటారు.