ప్రపంచంలో ఉన్న ఎన్నో అందమైన పెద్ద పువ్వులలో పొద్దుతిరుగుడు. ఇది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
Image credits: Getty
Telugu
సూర్యుడి వైపే చూపు
పొద్దుతిరుగుడు పువ్వులను సర్ ఫ్లవర్స్ అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడూ సూర్యుడిని చూస్తున్నట్టే ఉంటాయి. సూర్యుడు ఎటుంటే అటు తిరుగుతాయి.
Image credits: Getty
Telugu
సూర్యుడితో పాటే ప్రయాణం
సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. పొద్దుతిరుగుడు పువ్వు కూడా సూర్యుడితో పాటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. సూర్యుడి కోసం ఎదురుచూస్తుంది.
Image credits: Getty
Telugu
సైన్స్ ఏం చెబుతోంది?
పొద్దుతిరుగుడు పువ్వు ఇలా సూర్యుడి వైపు తిరగడాన్ని సైన్స్ పరిభాషలో 'హీలియోట్రోపిజం' అని అంటారు.
Image credits: Getty
Telugu
కారణం ఒక హార్మోన్
మొక్కల పెరుగుదలకు కూడా హార్మోన్లు అవసరం. పొద్దుతిరుగుడు పువ్వులో ఒక ప్రత్యేకమైన హార్మోన్ మొగ్గ కింద ఉన్న ఆకులలో తయారవుతుంది. అక్కడి నుంచి పువ్వు కాండంలోకి చేరుతుంది.
Image credits: Getty
Telugu
వెలుతురు వైపు వంగేలా..
కాంతి పడే దిశకు వ్యతిరేక దిశలో కాండంపై ఈ హార్మోన్ పేరుకుపోతుంది. ఆ భాగంలో కణాలు వేగంగా పెరిగి, ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో మొగ్గ సూర్యుడి వైపు వంగుతుంది.
Image credits: Getty
Telugu
సూర్యుడి కదలికకు అనుగుణంగా..
సూర్యుడు తూర్పున ఉన్నప్పుడు కాండం పశ్చిమ భాగంలోని కణాలు వేగంగా పెరుగుతాయి. ఫలితంగా, పువ్వు తూర్పు వైపు తిరుగుతుంది. సూర్యుడి కదలికకు అనుగుణంగా ఈ ప్రక్రియ రోజంతా జరుగుతూనే ఉంటుంది.