ఇంట్లో ఉండే బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకుని దాంతో పళ్లు తోముకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తే చాలు. రోజూ చేస్తే ఎనామిల్ దెబ్బతింటుంది.
ఇంట్లో ఉండే చిటికెడు పసుపు, ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి దంతాలు తోముకుంటే పసుపుదనం పోతుంది.
దంతాలపై పసుపు మరకలను తొలగించడానికి ఉప్పు సహాయపడుతుంది. మీరు రోజూ వాడే టూత్‌పేస్ట్‌పై కొద్దిగా ఉప్పు చల్లుకుని బ్రష్ చేస్తే చాలు.
ఒక టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 10-15 నిమిషాల పాటు పుక్కిలించి ఆయిల్ పుల్లింగ్ చేయాలి. తరువాత ఆ నూనెను ఉమ్మేసి బ్రష్ చేసుకోవాలి.
నారింజ పండు తొక్కతో దంతాలను రుద్దితే ఎంతో మంచిది. పళ్లపై ఉన్న మరకలు పోయి, అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
దంతాలు మెరుస్తూ ఉండాలంటే రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. అలాగే ఫ్లాసింగ్ చేయాలి. దంతాలు పసుపు రంగులోకి మారకుండా ఉంటాయి.
టీ, కాఫీలు తాగిన తరువాత వెంటనే నీటితో నోటిని పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే దంతాలపై మరకలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Snake Plant: ఇంటి లోపల ఈ మొక్కను పెంచితే ఇన్ని లాభాలా?