Telugu

ఈ మొక్కలకు విత్తనాలు అవసరం లేదు.. కొమ్మ పాతితే చాలు

Telugu

ఈ పూల మొక్కలను..

మీకు పూల మొక్కలు ఇష్టమా? అయితే గులాబీ, మందారం, మల్లె, చామంతి, డేలియా, బోగన్‌విలియా వంటి పూల మొక్కలను కొమ్మలను విరిచి మట్టిలో నాటితే చాలు.

Image credits: Storyblocks
Telugu

తీగ జాతి మొక్కలైతే...

మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, టర్టిల్ వైన్, మాన్‌స్టెరా వంటి మొక్కలకు కూడా విత్తనాలు నాటక్కర్లేదు. జస్ట్ చిన్న కొమ్మ తీసుకుని నాటుకోవాలి.

Image credits: Getty
Telugu

మొక్క నాటే సరైన పద్ధతి

కొమ్మ 4 నుంచి 6 అంగుళాల పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి. ఆ కొమ్మపై 2 నుంచి 3 కణుపులు ఉండేలా చూసుకోవాలి.

Image credits: Instagram
Telugu

ఇలా కత్తిరించాలి

కొమ్మ కింది భాగంలో ఉన్న ఆకులను తీసేయండి. కొమ్మను అడ్డంగా కాకుండా, ఒక వైపుకు ఏటవాలుగా (క్రాస్‌గా) కత్తిరించాలి.

Image credits: Instagram
Telugu

ఇలా నాటాలి

ఇలా కత్తిరించిన కొమ్మను నీటిలో లేదా తేమగా ఉన్న మట్టిలో నాటి, నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.

Image credits: Instagram
Telugu

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కొమ్మను పాతాక మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోండి.  అలాగని నీళ్లు ఎక్కువగా పోయొద్దు. సాధారణంగా 10-20 రోజుల్లో వేర్లు రావడం మొదలవుతుంది. 3-4 వారాల్లో కొత్త మొక్క సిద్ధమవుతుంది.

Image credits: Instagram

Red Bangles: శ్రావణమాస వేడుకలకు పర్ఫెక్ట్ గాజుల డిజైన్స్ ఇవి

Gold Rings:రూ.15వేలల్లో వచ్చేసే బంగారు ఉంగరాలు చూస్తే కొనకుండా ఉండలేరు

Silver Bracelet: మీ చిన్నారి చేతికి నప్పే అందమైన వెండి బ్రేస్ లెట్స్

Cotton Blouse: రోజూ వేసుకోవడానికి అదిరిపోయే కాటన్ బ్లౌజులు