తక్కువ బడ్జెట్ లో లైట్ వెయిట్ ఉంగరాలు కావాలంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్. ఈ ఉంగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మీకు రూ.15వేల లోపే వచ్చేస్తాయి. అలాంటి ఉంగరాల డిజైన్లు చూద్దాం..
సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ ఉంగరం చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. డైలీవేర్ కి ఇలాంటి ఉంగరాలు చాలా బాగుంటాయి. 1 గ్రాము బంగారంలోనే ఈజీగా లభిస్తుంది.
ప్రస్తుతం ఏస్తెటిక్ ట్రెండ్ నడుస్తోంది. మీరు కూడా డబుల్ చైన్‌తో ఉన్న ఇలాంటి గోల్డ్ రింగ్ కొనండి. ఇది 2 గ్రాములలో సులభంగా తయారవుతుంది. దీన్ని ధరిస్తే మీరు మోడ్రన్ గా కనిపిస్తారు.
ఫ్లోరల్ వర్క్ అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతాయి. అలాంటి డిజైన్ లో ఉంగరాలు కూడా చాలా బాగుంటాయి. ఈ ఉంగరం ఒక గ్రాము బరువులోనే లభిస్తుంది. బడ్జెట్ లోనే లభిస్తుంది.
స్టోన్స్ ఉన్నవి, డబుల్ లేయర్ ఉన్నవి.. ఇలాంటి ఉంగరాలను చాలామంది ధరిస్తారు. కానీ మీరు కాస్త సోబర్‌గా కనిపించాలంటే, సింపుల్ గోల్డ్ రింగ్ ఎంచుకోండి. డైలీవేర్ కి బాగుంటుంది.
ఈ రింగ్ చూడటానికి హెవీగా ఉన్నా.. కాస్త తక్కువ బరువులోనే లభిస్తుంది. మినిమల్, సింపుల్ లుక్ ఇస్తుంది. ఇలాంటి డిజైన్ లో చాలా మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి.