మీరు థాయ్‌లాండ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందుగా ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి. లేదంటే అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఫ్రీ వీసా ఎంట్రీ నిబంధనల ప్రకారం, థాయ్‌లాండ్‌లో బస చేసే గడువును 60 రోజుల నుంచి గరిష్ఠంగా 30 రోజులకు తగ్గించారు.
మీరు ప్రయాణించే తేదీ నుంచి మీ పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల పాటు వాలిడిటీ కలిగి ఉండాలి. ఈ కొత్త నిబంధనను తప్పనిసరి చేశారు.
థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లేటప్పుడు కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని అధికారులు చెక్ చేస్తారు.
థాయ్‌లాండ్‌లో మీరు బస చేసే హోటల్ బుకింగ్‌ను ముందుగానే కన్ఫర్మ్ చేసుకోండి. ప్రయాణ సమయంలో ఈ డాక్యుమెంట్లను మీ దగ్గర ఉంచుకోవాలి.
థాయ్‌లాండ్ చేరుకోవడానికి 72 గంటల ముందు 'డిజిటల్ అరైవల్ కార్డ్' (TDAC) ఫామ్‌ను తప్పనిసరిగా నింపాలి. దీన్ని అస్సలు మర్చిపోవద్దు.
చాలామంది టూరిస్ట్ వీసాపై థాయ్‌లాండ్‌కు వెళ్తారు. ఒకవేళ మీరు ఉద్యోగం కోసం వెళ్తున్నట్లయితే, దానికోసం ప్రత్యేక వీసా తీసుకోవాలి.
Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!
Stone Pendant: సింపుల్ చైన్ కి రాళ్ల లాకెట్.. స్టైలిష్ లుక్ గ్యారెంటీ
Gold Locket: బంగారు చైన్ కి సూపర్ గా సెట్ అయ్యే లాకెట్స్.. చూసేయండి!
Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్