ఈ సింపుల్ చిట్కాలతో తెల్ల జుట్టుకు చెక్.. ట్రై చేయండి!
life Jul 03 2026
Author: Kavitha G Image Credits:సోషల్ మీడియా
Telugu
కరివేపాకు
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత నూనె చల్లార్చి, జుట్టుకు పట్టించాలి. కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
Image credits: ఫ్రీపిక్
Telugu
బ్లాక్ టీ
జుట్టుకు నల్లని రంగును ఇవ్వడంలో బ్లాక్ టీ బాగా పనిచేస్తుంది. బ్లాక్ టీతో తలస్నానం చేయాలి. కనీసం 15-20 నిమిషాల పాటు బ్లాక్ టీని తలపై ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
Image credits: ఫ్రీపిక్
Telugu
వాల్‌నట్స్
కొన్ని వాల్‌నట్ షెల్స్‌ను పొడిగా చేసి, నీటిలో వేసి 30 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటితో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి రంగు ఇవ్వడంలో సహాయపడుతుంది.
Image credits: గెట్టి
Telugu
గోరింటాకు పొడి
కొంత గోరింటాకు పొడిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, కొన్ని గంటల తర్వాత కడిగేయాలి.
Image credits: సోషల్ మీడియా
Telugu
బంగాళాదుంప
బంగాళాదుంప తొక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత తొక్కలను తీసేసి, నీటిని వడకట్టి జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
Image credits: సోషల్ మీడియా
Telugu
కాఫీ పొడి
కాఫీ పొడిని జుట్టుకు పట్టించి, కాసేపటి తర్వాత నీటితో కడిగేయాలి. ఇది జుట్టు నెరవకుండా నివారిస్తుంది.