Lifestyle
నానబెట్టిన మెంతులను తిన్నా, మెంతుల పేస్టును తలకు అప్లై చేసుకున్నా జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యం మెరుగువుతుంది.
నానబెట్టిన మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా నానబెట్టిన మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తాయి.
బరువు తగ్గాలని అనుకుంటున్నారా.? అయితే ప్రతీ రోజూ ఉదయాన్నే నానబెట్టిన మెంతులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియకు కూడా నానబెట్టిన మెంతులు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ కంటెట్ కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
మహిళల్లో వచ్చే పీసీఓఎస్ సమస్యలను పరిష్కరించడంలో నానబెట్టిన మెంతులు ఎంతగానో ఉపయోగపడుతాయి. హార్మోన్ల అసమతుల్యతను సెట్ చేయడంలో నానబెట్టిన మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి.
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతింతంగా, ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.