Lifestyle

ఇవి తింటే తెల్ల వెంట్రుకలు రావు

Image credits: Getty

బచ్చలికూర

బచ్చలికూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరను తింటే చిన్న వయసులో తెల్ల జుట్టు రాదు. అలాగే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. 

Image credits: Getty

వాల్ నట్స్

వాల్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ నట్స్ ను తింటే మీకు తెల్ల వెంట్రుకలు తొందరగా రావు. అలాగే మీ జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

బాదం

బాదం పప్పులు కూడా జుట్టుకు మేలు చేస్తాయి. విటమిన్ ఇ, బయోటిన్ లు మెండుగా ఉన్న బాదం పప్పులు చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతాయి. 

Image credits: Getty

ఉసిరికాయ

ఉసిరికాయ మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉసిరికాయ చిన్న వయసులోతెల్ల వెంట్రుకలు రాకుండా, నల్లగా ఉంచుతుంది. 

Image credits: Getty

కరివేపాకు

విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకు కూడా తెల్ల వెంట్రుకలను రాకుండా ఆపుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే తెల్ల వెంట్రుకలు తొందరగా రావు. 

Image credits: Getty

క్యారెట్

విటమిన్ బి, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉన్న క్యారెట్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుంటే మీకు తెల్ల జుట్టు అంత తొందరగా రాదు. క్యారెట్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

చిలగడదుంప

విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు ఎక్కువగా ఉన్న చిలగడదుంపలు కూడా చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతాయి. 

Image credits: Getty

వెలగ పండుతో వెయ్యి లాభాలు.

భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టే విషయాలు ఇవే

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి

ఉదయాన్నే పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలి?