Lifestyle
చేప నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిని గనుక వాడితే మీరు పొందే లాభాలు అన్నీ ఇన్నీ కాదు తెలుసా? అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
చేప నూనెలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాల్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని జార్జియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది.
చేపనూనె మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. పలు పరిశోధనల ప్రకారం.. చేపలను ఎక్కువగా తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని తేలింది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చేప నూనె మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మాక్యులర్ క్షీణత చాలా వరకు తగ్గుతుంది.
చేప నూనె కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిని వాడితే సోరియాసిస్, డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చేప నూనె సహాయపడుతుంది. దీనిలో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి.
కాలెయ సమస్యలను తగ్గించడానికి, ఇవి రాకుండా చేయడానికి, కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చేప నూనె సహాయపడుతుంది.