Telugu

వర్షాకాలంలో ఎలుకల బెడదకు చెక్ పెట్టే చిట్కాలు

Telugu

కర్పూర తులసి నూనె

కర్పూరం, తులసి నూనెతో ఎలుకలకు చెక్ పెట్టవచ్చు. కర్పూరం, తులసి నూనెలో ముంచిన కాటన్ బాల్స్ ను ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఉంచండి. అటువైపు ఎలుకలు కన్నెత్తి కూడా చూడవంటే నమ్మండి.

Image credits: pexels
Telugu

వెల్లుల్లి

ఉల్లిపాయ, వెల్లుల్లి వాసనను కూడా ఎలుకలు భరించలేవు. వీటిని నూరి ఎలుకలు వచ్చే చోటల్లో ఉంచితే సరిపోతుంది.

Image credits: pexels
Telugu

యూకలిప్టస్ నూనె

యూకలిప్టస్ నూనెలో కొద్దిగా నీళ్లు కలిపి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు. ఆ వాసనకు ఎలుకలు చిరాకుపడిపోతాయి. ఆ దరిదాపుల్లోకి రావు.

Image credits: Getty
Telugu

వంటింట్లో జాగ్రత్త

వంటగదిలో ఆహార పదార్థాలు తెరిచి ఉంచితే ఎలుకలను ఆకర్షించే అవకాశం ఎక్కువ. కాబట్టి అన్ని ఆహార పదార్థాలను బిగుగా మూసిన డబ్బాల్లోనే ఉంచాలి.

Image credits: Getty
Telugu

శుభ్రత చాలా ముఖ్యం

చెత్త ఎలుకలకు ప్రధాన ఆకర్షణ. కాబట్టి వంటగదిలో చెత్త ఉంచకుండా, ప్రతిరోజూ బయటకు తీసేయడం వల్ల ఎలుకల బెడద తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

అల్ట్రాసోనిక్ పరికరం

అల్ట్రాసోనిక్ పరికరాలు ఇంట్లో ఉంటే ఎలుకల బెడద ఉండదు. ఎందుకంటే వీటిి నుండి వచ్చే శబ్దం ఎలుకలకు అసహనంగా ఉంటుంది. ఇది రసాయన రహితంగా ఎలుకల బెడదను తగ్గించే సురక్షిత మార్గం.

Image credits: Getty

Gold Earrings: రూ.20 వేలల్లో దొరికే అందమైన బంగారు కమ్మలు.. ట్రై చేయండి

Health tips: రాత్రి పడుకునేముందు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Fastest growing plants : వర్షాకాలంలో త్వరగా పెరిగే మొక్కలు ఇవే..

Weight Loss: ఇలా వాకింగ్ చేశారంటే.. ఇట్టే బరువు తగ్గుతారు