Lifestyle

అసిడిటీ ఉన్న వారు.. ఇవి అస్సలు తినకూడదు

Image credits: Freepik

సిట్రస్‌ జాతి పండ్లు

అసిడిటీతో బాధపడేవారు నారింజ, నిమ్మ, టమాటో వంటి సిట్రస్‌ జాతికి చెందిన వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి సమస్యను మరింత ఎక్కువ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

పాల పదార్థాలు

ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల పాల పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పన్నీర్‌, వెన్న వంటి వాటికి దూరంగా ఉండాలని అంటున్నారు. 

Image credits: Freepik

జంక్‌ ఫుడ్‌

అసిడిటీ సమస్య పెరగడానికి జంక్‌ ఫుడ్‌ కూడా ఒక కారణమం. పిజ్జా, బర్గర్‌ వంటి బేకరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య మరింత ఎక్కువుతుంది. 

Image credits: Getty

కూల్ డ్రింక్స్‌

కూల్‌ డ్రింక్స్‌ తాగే వారిలో తరచుగా అసిడిటీ సమస్య వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 

Image credits: Getty

ఉల్లిపాయ

ఉల్లిపాయ కూడా అసిడిటీని ప్రేరేపిస్తుంది. అందుకే అసిడిటీతో బాధపడేవారు ఉల్లిపాయను మితంగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయను అస్సలు తీసుకోకూడదు. 

Image credits: Freepik

ఏం తినాలంటే

అసిడిటీతో బాధపడేవారికి అరటి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలో యాసిడ్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. దీంతో కడుపు హాయిగా ఉంటుంది. 

Image credits: Getty

కీరా

అసిడిటీతో బాధపడేవారు కీరా దోసను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో పీహెచ్‌ స్థాయిని పెంచి అసిడిటీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Image credits: Pixabay

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చాణక్య నీతి: భార్యకు భర్త తప్పకుండా ఇవ్వాల్సినవి ఇవే

Chanakya Niti: పొరపాటున కూడా పురుషులు స్త్రీలతో ఈ 4 పనులు చేయకూడదు

చాణక్య నీతి.. వీటివల్లే ధనవంతులు కూడా పేదవారు అవుతారు

ఈ నీళ్లను వాడితే.. జుట్టు ఊడిపోదు, పొడుగ్గా పెరుగుతుంది