మీకు డబ్బు కావాలా? అయితే ఇలాంటి లాఫింగ్ బుద్ధ విగ్రహం కొనండి
Telugu
బుద్ధ పూర్ణిమ ఎప్పుడు?
ఈసారి మే 12, సోమవారం బుద్ధ పూర్ణిమ వచ్చింది. ఫెంగ్ షుయ్‌లో ఉపయోగించే లాఫింగ్ బుద్ధ కూడా బుద్ధుని రూపమే. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Telugu
ధనలాభం కోసం..
మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే డబ్బు సంచిని చేతిలో పట్టుకున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. ఇది బంగారు రంగులో ఉంటే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి.
Telugu
సుఖ శాంతుల కోసం..
మీరు సుఖ శాంతులు కోరుకుంటే ధ్యానంలో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవితంలో సుఖ శాంతులు, సమృద్ధిని కలిగిస్తుంది.
Telugu
అదృష్టం కోసం..
మీ అదృష్టం బాగోలేదా? దాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే బంగారు బంతిని చేతిలో పట్టుకున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోండి. దీని వల్ల మీ కోరిక నెరవేరుతుంది.
Telugu
ఆరోగ్యం కోసం..
మీరు ఆరోగ్యం కోరుకుంటే రెండు చేతులూ పైకెత్తి ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. దీని వల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
Telugu
ప్రగతి కోసం..
ఉద్యోగం, వ్యాపారంలో ప్రగతి కోరుకుంటే తాబేలుపై కూర్చున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఆఫీసులో, దుకాణంలో లేదా పని ప్రదేశంలో ఉంచుకోండి. దీని వల్ల మీ కోరిక కూడా నెరవేరుతుంది.