Telugu

నిమ్మ తొక్కతో ఇలాంటి లాభాలున్నాయా? మీక్కూడా తెలిసి ఉండదు..

Telugu

వంట పాత్రల కోసం

మనం వంట పాత్రలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే లిక్విడ్స్‌, సబ్బుల్లో లెమన్‌ ఉందని ప్రకటనల్లో ఇస్తుంటారు. అందుకే నిమ్మ తొక్కలతో పాత్రలను శుభ్రం చేస్తే తళుక్కుమంటాయి. 

Image credits: Pinterest
Telugu

జిడ్డు

ముఖ్యంగా నూనెతో జిడ్డుగా మారిన పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలోని ఆమ్ల స్వభావం జిడ్డును దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Pinterest
Telugu

గ్యాస్‌ స్టవ్‌

రకరకాల వంటలు చేసే క్రమంలో గ్యాస్‌ స్టవ్‌పై మరకలు పడడం సర్వసాధారణమైన విషయం. వీటిపై నిమ్మ తొక్కలతో బాగా రాసి శుభ్రం చేస్తే స్టవ్‌ పై ఉండే మరకలు తొలిగిపోతాయి. 
 

Image credits: social media
Telugu

మైక్రోవేవ్ ఓవెన్‌

మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఆహార పదార్థాలు పడితే మురికిగా మారుతాయి. ఇలాంటి సమయంలో ఒక గిన్నెలో నీరు తీసుకొని వాటిలో నిమ్మ తొక్కలను వేసి ఓవెన్ లో పెట్టి తర్వాత తుడిస్తే క్లీన్ అవుతుంది. 

Image credits: Freepik
Telugu

రాగి పాత్రలు తళుక్కుమనేలా

రాగి పాత్రలు త్వరగా మురికిగా మారుతుంటాయి. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడానికి నిమ్మతొక్కలు ఉపయోగపడతాయి. కాస్త ఉప్పు వేసి నిమ్మ తొక్కతో రుద్దితే రాగి పాత్రలు తళుక్కుమంటాయి. 
 

Image credits: Getty
Telugu

ఆరోగ్యానికి కూడా

ఆరోగ్యానికి కూడా నిమ్మ తొక్కలు ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కల్లోని విటమిన్‌ సి గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ తొక్కలతో చేసిన చట్నీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 
 

Image credits: social media
Telugu

షుగర్‌ పేషెంట్స్‌

డయాబెటిస్‌ పేషెంట్స్‌కి కూడా నిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కల్లో హెస్పిరిడిన్‌ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Pinterest

పప్పుల డబ్బాలో అగ్గిపుల్ల పెడితే ఏమౌతుంది?

మీలో ఈ లక్షణాలున్నాయా? మానసిక ఒత్తిడి ఉన్నట్లే..

మటన్ రోజూ తింటే ఏమౌతుంది?

ఉల్లిపాయలు త్వరగా పాడవుతున్నాయా? ఇలా చేస్తే నెల రోజులైనా..