Lifestyle
సాధారణంగా ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా లేకపోతనే త్వరగా పాడవుతుంటాయి. అందుకే కొన్ని పద్ధతులు పాటించాలి.
ఉల్లిపాయలను కొనుగోలు చేసే ముందే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. దెబ్బలు తగిలిన, రంగు మారిన ఉల్లి పాయలను కొనుగోలు చేయకూడదు. ఇవి త్వరగా పాడవుతాయి.
ఉల్లిపాయలను కొనుగోలు చేసే ముందు రెండు వైపులా వాటిని చేతితో నొక్కాలి. ఒకవేళ చేతికి మెత్తగా ఉన్నట్లు భావన కలిగితే అలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు.
పగుళ్లు ఉన్న ఉల్లిపాయలను కూడా కొనుగోలు చేయకూడదు. ఇవి ఎంత జాగ్రత్తగా నిల్వచేసినా ఎక్కువ కాలం నిల్వ ఉండవు.
ఉల్లి పాయలను నిల్వ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కవర్‌లో పెట్టకూడదు. గాలి తగిలే స్థలంలో నేలపై ఒక కవర్ వేసి పెడితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
గోడలకు నీటి తడి వచ్చే ప్రదేశాల్లో ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది.
చాలా మంది ఉల్లిపాయలను, బంగాళ దుంపలను ఒకే చోట నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఉల్లి పాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.