Telugu

పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగితే ఏమౌతుంది?

Telugu

ఉదయాన్నే నీళ్లు తాగాలా?

నీళ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే డాక్టర్లు నీళ్లను పుష్కలంగా తాగాలని సలహానిస్తుంటారు. అయితే ఉదయం లేవగానే అంటే పళ్లు తోముకోవడానికి ముందే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా? 

Image credits: our own
Telugu

పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగితే

నైట్ నిద్రవల్ల మన శరీరంలో నీరు తగ్గుతుంది. అందుకే ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ అయ్యి హెల్తీగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

Image credits: our own
Telugu

బాక్టీరియాను తొలగిస్తుంది

మన లాలాజలంలో ఉండే సహజ ఎంజైమ్లు చెడు బాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి. పరిగడుపున నీళ్లను తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: our own
Telugu

ఆయుర్వేద ప్రాముఖ్యత

ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది. రోజూ ఇలాగే నీళ్లు తాగితే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

కడుపుని శుభ్రపరుస్తుంది

ఉదయాన్నే నీళ్లను తాగితే పేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య ఉండదు. జీవక్రియ పెరుగుతుంది. శరీరం చురుగ్గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. 

Image credits: our own
Telugu

తలనొప్పి తగ్గుతుంది

పళ్లు తోముకోవడానికి ముందు నీళ్లను తాగితే మైగ్రేన్, తలనొప్పి కూడా తగ్గుతాయి. పరిగడుపున నీళ్లను తాగితే బరువు కూడా తగ్గుతుంది. ఎలా అంటే ఇది ఆకలిని తగ్గించి అతిగా తినకుండా చేస్తుంది. 

Image credits: our own

గొప్ప లీడర్ కావాలనుకుంటున్నారా? ఈ లక్షణాలు ఉండాల్సిందే !

Chanakya niti: చాణక్యనీతి ప్రకారం డబ్బు కంటే విలువైనవి ఏంటో తెలుసా?

Vastu: వాస్తు ప్రకారం కిచెన్‌లో ఈ 3 వస్తువులను తిరగేసి పెట్టకూడదంట!

మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!