Lifestyle
బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.
బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా బిర్యాటీ టీ బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
బిర్యానీ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటే బిర్యానీ ఆకులతో చేసిన టీని తాగాలి. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
బిర్యానీలో క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. అలాగే లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.