Lifestyle
జీవితంలో విజయం సాధించడానికి మంచి గురువు ఉండటం చాలా ముఖ్యం అని అంటారు. అంబానీ కుటుంబం కూడా ఈ సూత్రాన్నే పాటిస్తుంది.
ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి రమేష్ భాయ్ ఓజా ఒక ముఖ్యమైన గురువు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన రమేష్ భాయ్.. అంబానీల ప్రతి పెద్ద నిర్ణయంలో కీలక సలహాదారు.
రమేష్ భాయ్ ఓజా గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 'సందీపని విద్యానికేతన్ ఆశ్రమం' నడుపుతున్నారు. ఈ ఆశ్రమం ప్రభావం అంబానీ కుటుంబంపైనే కాకుండా దేశంలోని చాలా మంది ప్రముఖ నాయకులపై కూడా ఉంది.
ధీరూభాయ్ అంబానీ తన వృత్తిలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు రమేష్ భాయ్ ఓజాతో అంబానీ కుటుంబం అనుబంధం ప్రారంభమైంది. ఆయన సలహాలను అంబానీ కుటుంబం కచ్చితంగా పాటిస్తుంది.
ముఖేష్ అంబానీ తన గురువు సలహా తీసుకుని వ్యాపారంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. అంబానీ సోదరుల మధ్య వ్యాపార వివాదం తలెత్తినప్పుడు కూడా రమేష్ భాయ్ ఓజా దిశానిర్దేశం చేశారట.
1997లో ధీరూభాయ్ అంబానీ భార్య కోకిలాబెన్ రామకథ కోసం రమేష్ భాయ్ ఓజాను ఆహ్వానించారు. ఆయన ప్రవచనాల ద్వారా అంబానీలతో ఆయన బంధం మరింత బలపడింది.
రమేష్ భాయ్ ఓజా.. అంబానీ కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రధాని మోడీ, గుజరాత్‌కు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఆయన ఆశ్రమానికి వెళ్లి సలహాలు తీసుకుంటారు.