బార్లీ నీళ్లను రెగ్యులర్ గా తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
life Jul 20 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
కొలెస్ట్రాల్
బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ
బార్లీ నీటిలో డైటరీ ఫైబర్, బీటా-గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధకాన్ని నివారిస్తాయి.
Image credits: Getty
Telugu
చక్కెర స్థాయిలు
బార్లీకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చక్కెర కలపని బార్లీ నీళ్లు తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యం
బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్స్, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి బాగా సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
శరీర బరువు
బార్లీ నీళ్లు తాగితే కడుపు ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్‌తో పాటు వీటిని తీసుకుంటే, అనవసరంగా తినాలనే కోరిక కంట్రోల్ అవుతుంది.
Image credits: Getty
Telugu
కిడ్నీల పనితీరు
నిపుణుల ప్రకారం బార్లీ నీళ్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.