Lifestyle
బియ్యం, పప్పులు ఊరికే పురుగులు పట్టేస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం...
లవంగాల ఘాటైన వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. లవంగాల ఘాటు వాటికి సహించదు.
బిర్యానీ ఆకు వాసన పురుగులకు నచ్చదు. కాబట్టి బియ్యం, పప్పుల్లో కొన్ని బిర్యానీ ఆకులను వేయండి.
ఎండుమిర్చి వేస్తే ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మిర్చి ఘాటు పురుగులకు నచ్చదు.
వెల్లుల్లి వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. ధాన్యం డబ్బాల్లో కొన్ని రెబ్బలు వేయండి.
పసుపు సహజ క్రిమిసంహారిణి. ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి సహాయపడుతుంది. పసుపు ముక్కలు వేయండి.