Telugu

సునీతా విలియమ్స్‌ గురించి ఎవరికీ తెలియని విషయాలు

Telugu

8 రోజుల కోసమని వెళ్లి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల కోసం వెళ్లిన సునీతా సాంకేతిక సమస్యల కారణంగా ఏకంగా 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. 
 

Image credits: social media
Telugu

ఫలించిన ప్రయత్నాలు

దీంతో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో చేతులు కలిపిన నాసా సునీత విలియమస్‌తో పాటు విల్మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయగా తాజాగా ఆ ప్రయత్నాలు ఫలిచ్చాయి. 

Image credits: Pinterest
Telugu

భూమిపైకి ఎప్పుడు రానున్నారు?

అమెరికా కాలమాన ప్రకారం సునీత విలియమ్స్‌ మంగళవారం 5.57 గంటలకు భూమ్మీద ల్యాండ్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Image credits: Pinterest
Telugu

సునీతా తండ్రి ఎవరు.?

సునీతా విలియమ్స్‌ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారు. ఆమె తండ్రి న్యూరో అనాటమిస్ట్‌గా వైద్య వృత్తిని కొనసాగించారు. 
 

Image credits: Pinterest
Telugu

ఇద్దరు సంతానం

దీపక్‌ పాండ్యాకు స్లోవేకియాకు చెందిన ఉర్సులైన్ బోన్ని పాండ్యాను వివాహం చేసుకొన్నారు. వారికి సునీతా, జేయ్ థామస్, దినా ఆనంద్ సంతానం కలిగారు.
 

Image credits: Pinterest
Telugu

సునీత ఎక్కడ జన్మించారు.?

సునీతా 1965, సెప్టెంబర్ 19న  ఒహియోలో జన్మించారు. నీదమ్ హై స్కూల్ విద్యను 1983లో పూర్తి చేశారు. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేశారు.
 

Image credits: social media
Telugu

అరుదైన రికార్డు

ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ డిగ్రీ సాధించిన సునీతా విలియమ్స్‌ 59 ఏళ్ల వయసులో అత్యధిక స్పేస్ వాక్స్ సాధించిన ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించారు.
 

Image credits: social media
Telugu

ఎక్కడ ల్యాండ్‌ కానున్నారు?

సునీతా విలియమ్స్, విల్మోర్‌ను క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమికి చేరుకోనున్నారు. భారత కాలమాన బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ఫ్లోరీడా సముద్ర జలాల్లో ల్యాండ్‌ అవుతారు. 
 

Image credits: social media

సునీతా విలియమ్స్ భర్త ఎవరు? ఇండియాతో ఆమెకు ఉన్న సంబంధాలు ఏంటి.?

బంగ్లాదేశ్ విలవిల.. ట్రంప్ దెబ్బ మామూలుగా లేదుగా!

పాకిస్థాన్ 32, సింగపూర్ 193 భారత్ పాస్ పోర్ట్ ఎన్ని దేశాల్లో ఎంట్రీ?

మరీ అంత ఖరీదా? F-35 జెట్ తో 80 రోల్స్ రాయిస్ కార్లు కొనేయొచ్చుగా!!