INTERNATIONAL
బెంగళూరులో ఏరో ఇండియా ఎయిర్ షో అందరినీ ఆకట్టుకోనుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ అమెరికాకు చెందిన ఐదో తరం యుద్ధ విమానం F-35.
F-35 విమానం చాలా ఖరీదైనది. ఒక విమానం కొనాలంటే 100 మిలియన్ నుండి 400 మిలియన్ డాలర్లు (865.36 కోట్ల నుండి 3461 కోట్ల రూపాయలు) ఖర్చు అవుతుంది.
ఒక F-35 విమానానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చయితే, అంత డబ్బుతో 80 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొనొచ్చు.
F-35 విమానం ధర స్థిరంగా ఉండదు. ఏ దేశం కొంటోంది, ఆ దేశానికి అమెరికాతో ఉన్న సంబంధాలు, విమానంలో ఎన్ని ఆయుధాలు, సౌకర్యాలు ఉన్నాయో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
F-35 విమానాల సంఖ్య కూడా ధరను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ విమానాలు కొంటే ధర తగ్గుతుంది. తక్కువ విమానాలు కొంటే ఒక్కొక్క జెట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి.
సైనిక విశ్లేషకుల ప్రకారం, F-35 యుద్ధ విమానం యొక్క ప్రతి యూనిట్ ధరలో నిర్వహణ, మద్దతు ఖర్చులు కూడా ఉంటాయి. ఇది 100 మిలియన్ డాలర్ల నుండి 400 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
ప్రస్తుతం F-35 నాలుగు వేరియంట్లు వాడుకలో ఉన్నాయి. F-35A, F-35B, F-35C, F-35I ‘Adir’. అన్నిటి ధరలూ వేర్వేరుగా ఉంటాయి.
ఒక F-35A 110.3 మిలియన్ డాలర్లు, F-35B $135.8 మిలియన్ డాలర్లు, F-35C $117.3 మిలియన్ డాలర్లు, F-35I ‘Adir’ $120 మిలియన్ డాలర్లు.
F-35 ఇంజిన్ సగటు ధర దాదాపు 19.7 మిలియన్ డాలర్లు (169 కోట్ల రూపాయలు). ఏ దేశం ఎక్కువ F-35 ఇంజిన్లు కొంటే, ప్రతి యూనిట్ ధర అంత తక్కువగా ఉంటుంది.
F-35ని ఎగరడానికి గంటకు 38,000 డాలర్లు (32.88 లక్షల రూపాయలు) ఖర్చవుతుంది. ఇంధనం కోసం గంటకు 3,000 నుండి 3,500 డాలర్లు ఖర్చవుతాయి.
F-35A వార్షిక నిర్వహణ ఖర్చు 4.1 మిలియన్ డాలర్లు, F-35Bకి 6.8 మిలియన్ డాలర్లు, F-35Cకి 7.5 మిలియన్ డాలర్లు అవుతుందని అంచనా.