సినిమా ప్రియులకు కచ్చితంగా ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఇది ఒకటి. హ్యాపీగా రోజంతా ఎంజాయ్ చేయచ్చు.
చార్మినార్ చూడటం పాత హైదరాబాద్ నోస్టాల్జియాను గుర్తు చేస్తుంది. దాని పక్కనే ఉన్న లాడ్ బజార్ గాజులు, ముత్యాలు, స్ట్రీట్ ఫుడ్ కి బెస్ట్ ఛాయిస్.
సాయంత్రం సరస్సు ఒడ్డున గడపాలనుకుంటున్నారా? అయితే హుస్సేన్ సాగర్ సరైన ఎంపిక. నెక్లెస్ రోడ్డుపై సూర్యాస్తమయం, బోటింగ్ ఆనందించొచ్చు.
గోల్కొండ కోట చరిత్రను తెలుసుకోండి. కోట పై నుంచి హైదరాబాద్ నగరం మరింత అందంగా కనపడుతుంది.
కళలు, చేతిపనులు, గ్రామ సంస్కృతి, సృజనాత్మకతకు శిల్పారామం ప్రతీక. ప్రత్యక్ష ప్రదర్శనలు, చేతితో తయారు చేసిన కళలు ఆకట్టుకుంటాయి.
జూబ్లీహిల్స్ సమీపంలోని ఈ ప్రదేశం ప్రశాంత వాతావరణం కలిగి ఉంది. సరస్సు ఒడ్డున కేఫ్‌లు, కేబుల్ బ్రిడ్జ్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కేఫ్‌లు, పబ్‌లలో సాయంత్రం గడపడం ఆనందదాయకంగా ఉంటుంది.. డ్రింక్స్ , లైవ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
మియాపూర్-పటాన్‌చెరు.. మెట్రో స్టేషన్స్ ఎక్కడెక్కడో తెలుసా?
సంక్రాంతికి వాహనాల్లో ఊరు వెళ్తున్నారా.? తెలంగాణ పోలీసులు కీలక సూచనలు
ఇది కార్యరూపం దాల్చితే.. హైదరాబాద్ రూపురేఖలు మారడం ఖాయం