Hyderabad

ఇది కార్యరూపం దాల్చితే.. హైదరాబాద్ రూపురేఖలు మారడం ఖాయం

Image credits: Getty

రవాణా విప్లవం

ప్రజా రవాణా రంగంలో సరికొత్త విప్లవంగా దూసుకొచ్చింది హైదరాబాద్ మట్రో. 3 కారిడార్లు, 66 స్టేషన్లతో వేలాది మంది ప్రయాణికులు ప్రతీ రోజూ నగరంలో ప్రయాణం చేస్తున్నారు. 
 

Image credits: Social Media

మూడు కారిడార్లలో

కారిడార్‌ 1లో భాగంగా ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్‌ వరకు, కారిడార్‌ 2లో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌, కారిడార్‌ 3లో భాగంగా నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. 

Image credits: Social Media

రెండో దశలో భాగంగా

రెండో దశలో పలు మార్గాల్లో మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట, నాగోల్‌-ఎల్‌బీనగర్‌-చాంద్రాయణగుట్ట- ఆరాంఘర్‌-శంషాబాద్‌ వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. 
 

Image credits: Social Media

వీటితో పాటు..

రాయదుర్గం - కోకాపేట నియోపోలిస్‌, మియాపూర్‌ - పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు - ఓఆర్‌ఆర్‌ మీదుగా కొంగరకలాన్‌- ఫోర్త్‌ సిటీ వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. 

 

Image credits: social media

రెండో దశ పార్ట్‌ బి

సీఎం రేవంత్‌ రెడ్డి మెట్రోను మరింత విస్తరించే నేపథ్యంలో రెండో దశలో పార్ట్‌ బిని ప్రాతి పదించారు. ప్యారడైజ్‌- మేడ్చల్‌, జేబీఎస్‌ - శామీర్‌పేట వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 

Image credits: iSTOCK

సాకారమైతే

మెట్రో రెండో దశ పార్ట్‌ బి సాకారమైతే హైదరాబాద్‌ ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. ఇటు శామిర్‌ పేట, అటు మేడ్చల్‌ వరకు మెట్రో విస్తరణ జరిగే నగర విస్తృతి మరింత పెరగడం ఖాయం. 

Image credits: iSTOCK

రియల్‌ ఎస్టేట్‌

ఈ కొత్త లైన్స్‌ అందుబాటులోకి వస్తే నగరశివారులతో పాటు కరీంనగర్ హైవే, అటు నిజామాబాద్ హైవేలపై రియల్ ఎస్టేట్‌ వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

Image credits: social media