Hyderabad
మెట్రో రెండో దశ విస్తరణలో మియాపూర్-పటాన్‌చెరు ఒకటనే విషయం తెలిసిందే. తాజాగా ఈ రూట్‌కు సంబంధించి అధికారులు కీలక వివరాలను వెల్లడించారు.
మియాపూర్ నుంటి పటాన్ చెరు వరకు మొత్తం 13 కిలోమీర్ల మేర మేట్రోను నిర్మించనున్నారు. బీహెచ్‌ఈల్ వద్ద ఫ్లై ఓవర్ పనులు నడుస్తున్నాయి. దీంతో దీనికి సమాంతంగా మంట్రో వచ్చే అవకాశం ఉంది.
13 కిలో మీటర్ల మార్గంలో మొత్తం 10 స్టేషన్స్ రానున్నాయి. ఇందుకోసం సుమారు రూ. 4107 కోట్లు ఖర్చు చేయనున్నారు.
స్టేషన్స్ విషయానికొస్తే మియాపూర్ క్రాస్ రోడ్, అల్విన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీపురం, ఇక్రిసాట్, పటాన్ చెరు.
హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లాను కనెక్ట్ చేసే ఈ మెట్రో ద్వారా 2028 నాటికి కనీసం 1.65 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓఆర్‌ఆర్ దగ్గరగా ఉండడం, పారిశ్రామిక కారిడార్ కావడంతో మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. మెట్రో రాకతో ప్రయాణికులకు ఊరట లభించనుంది.