Health

ముఖం అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి!

కొల్లాజెన్ తో చర్మం మెరిసిపోతుంది!

కొల్లాజెన్.. శరీరంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మాన్ని మెరిపించడానికి బాగా సహాయపడుతుంది. కొన్ని ఇంటి చిట్కాలతో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి చర్మాన్ని మెరిపించవచ్చు.

విటమిన్ C ఫుడ్స్‌

నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి విటమిన్ సి ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ స్థాయిని పెంచవచ్చు. నిమ్మ తొక్క లేదా రసాన్ని ఫేస్ ప్యాక్ చేయడానికి వాడండి.

కొల్లాజెన్ కోసం ప్రోటీన్ ఫుడ్

కొల్లాజెన్ పెంచడానికి ప్రోటీన్ ఉన్న ఆహారం తినండి. మీరు నాన్ వెజ్ తింటే గుడ్డు, చేప తినండి. పనీర్, పెరుగు, పప్పులు, బీన్స్ కూడా కొల్లాజెన్‌ను పెంచుతాయి.

కొల్లాజెన్ సప్లిమెంట్స్‌తో చర్మం మెరుపు

మీరు చర్మంలో మెరుపు పెంచాలనుకుంటే డాక్టర్‌ని అడిగి కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. దీని వల్ల చర్మంపై మంచి ఫలితం కనిపిస్తుంది.

తప్పకుండా చేయాల్సిన పని

మీరు రోజూ తగినంత నిద్రపోకపోతే మీ చర్మంపై చెడు ప్రభావం పడుతుంది. కొల్లాజెన్ తక్కువగా తయారవుతుంది. మంచి నిద్రతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

సంతోషంగా ఉంటే చర్మం మెరుస్తుంది

వినడానికి వింతగా ఉండొచ్చు. కానీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల చర్మం పాడవుతుంది. సంతోషంగా ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట.

మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఇంత నష్టమా? రక్షణ పొందడం ఇంత ఈజీనా?

Skin care: రెగ్యులర్ గా ఈ ఒక్కటి తింటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు!

Birth Control Pills: తరచూ గర్భ నిరోధక మాత్రలు వాడితే ఏమవుతుందో తెలుసా?

Cooking Oils: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే వంట నూనెలు ఇవే..!