Health
రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వాళ్లు వాటిని తగ్గించడానికి దాల్చిన చెక్కను మీ ఆహారంలో చేర్చుకోండి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పీచు పదార్థం కలిగిన మెంతులను ఆహారంలో చేర్చుకోవడం షుగర్ పేషెంట్లకు మంచిది.
జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు అల్లంలో ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లిలోని సల్ఫర్ కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన లవంగాలను ఆహారంలో తింటే రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.
నల్ల మిరియాలను ఫుడ్ ద్వారా తీసుకుంటే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.