Health
1 గుడ్డు, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి.
గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పెరుగు, గుడ్డు, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉంచండి.
ముందుగా జుట్టును రెండు భాగాలుగా చేసి తయారుచేసిన హెయిర్ మాస్క్‌ను కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి గంట సేపు అలాగే ఉంచండి.
హెయిర్ మాస్క్ బాగా ఆరిన తర్వాత వేడి నీటితో షాంపూ వేసి స్నానం చేయాలి. జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడొద్దు.
జుట్టు పొడిగా ఉన్నవారు ఈ హెయిర్ మాస్క్ వాడితే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.
గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టుకు కావాల్సిన పోషణ ఇస్తుంది. పెరుగులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి రెండూ కలిసి జుట్టుకు మేలు చేస్తాయి.
ఈ హెయిర్ మాస్క్ చుండ్రు, జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇంకా జుట్టును బలంగా మార్చడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఏం చేయాలి?
Skin care: ముఖం అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి!
మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఇంత నష్టమా? రక్షణ పొందడం ఇంత ఈజీనా?
Skin care: రెగ్యులర్ గా ఈ ఒక్కటి తింటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు!