అబార్షన్‌కు ఈ తప్పులే కారణం.. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్త
Image credits: Freepik
ప్రయాణాలు
గర్భం దాల్చిన విషయం తెలిసిన తర్వాత మహిళలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకూడదు అలాగే వేగంగా మెట్లు దిగడం లాంటివి మానుకోవాలి.
Image credits: Freepik
వ్యాయామాలు
వ్యాయామాలు చేసే అలవాటు ఉండే వారు మొదటి మూడు నెలల వరకు అన్ని మానుకోవాలి. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు.
Image credits: Freepik
స్మోకింగ్
ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. అదే విధంగా స్మోకింగ్ చేసే వారి పక్కన కూడా ఉండకూడదు. దీనివల్ల తల్లితో పాటు, కడుపులో బిడ్డపై కూడా దుష్ప్రభావం పడుతుంది.
Image credits: unsplash
ఒత్తిడిని జయించడం
గర్భందాల్చిన మహిళల్లో ఒత్తిడి పెరగడం సహజం. అందుకే యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి.
Image credits: pinterest
కొన్ని రకాల పండ్లు
గర్భం దాల్చిన మహిళలు పచ్చి బొప్పాయిని తీసుకోకూడదని నిపుణులు చెబుతుంటారు. ఇది అబార్షన్‌కు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Image credits: instagram
మద్యపానం
ఆల్కహాల్ అలవాటు ఉన్న వారు కూడా ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. మద్యం సేవించడం వల్ల కడుపులో బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
గమనిక
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.