పనివేళలు, గందరగోళమైన దినచర్య కారణంగా చాలామందిలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇది గుండెపోటుకు దారితీయొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయండి.
వ్యాయామం తప్పనిసరి
గుండెను బలంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి, యోగా, ఈత, సైక్లింగ్ లాంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పోషకాహారం తీసుకోండి
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. పండ్లు, ధాన్యాలు, పన్నీర్, ఆకుకూరలు, పాలు లాంటివి ఆహారంలో భాగమవ్వాలి.
సరిపడా నీళ్లు తాగండి
గుండె ఆరోగ్యగానికి ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. గుండె కూడా బలంగా ఉంటుంది.
ప్రతి 3 నెలలకు ఒకసారి..
గుండె జబ్బులను ముందే పసిగట్టేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే తెలిసిపోతుంది.