Jasmine Flower : అందాన్ని ఇచ్చే మల్లెలు ఎక్కువగా పూయాలంటే..?
gardening Jul 14 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
నేల రకం
మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. స్థలం, వాతావరణానికి తగిన రకం ఎంచుకోవాలి. మల్లె చెట్టు పెరగడానికి బాగా ఎండినపోయిన నేల అవసరం. ఇది ఇసుక నేలలో కూడా బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
సరైన కుండీ ఎంపిక
మల్లె మొక్క పెంచడానికి కనీసం 14 అంగుళాల లోతుతో, మంచి నీటిపారుదల గల రంధ్రాలున్న కుండీని తీసుకోవాలి. వేళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకూడదు.
Image credits: Getty
Telugu
నీటిపారుదల
మల్లెలు తెల్లగా అందంగా విచ్చుకోవాలంటే మాత్రం క్రమం తప్పకుండా నీరు పెడుతూ ఉండాలి. అయితే మరీ ఎక్కువగా నీరు పెట్టినా కూడా చేటే.. వేళ్ళకు నీరు ఎక్కువై కుళ్ళిపోతాయి.
Image credits: Getty
Telugu
సూర్యరశ్మి
మల్లెలకు కనీసం 6 గంటల సూర్యరశ్మి అవసరం. బాగా ఎండ పడే చోట మల్లె నాటాలి. ఇవి తేమతో కూడిన వాతావరణంలోనే పెరుగుతాయి.
Image credits: Getty
Telugu
తరచూ కత్తిరిస్తే..
వాడిపోయిన పూలు, ఎండిన కొమ్మలను తీసివేయడం వల్ల కొత్త కొమ్మలు పెరిగి ఎక్కువ పూత వస్తుంది. ప్రతి వారం ఇలా కత్తిరిస్తే మల్లెలు ఎక్కువగా పూస్తాయంట.
Image credits: Getty
Telugu
నెలకోసారి పోషణ
మల్లె మొక్కకు నెలకోసారి ద్రవ రూపంలో వళం ఇవ్వాలి. ఇది వేళ్లకు త్వరగా అందుతుంది. బయోలిక్విడ్ ఫర్టిలైజర్‌లు, కాయలు, పండ్ల తొక్కల మిశ్రమం, కంపోస్ట్ వంటి ప్రకృతిసిద్ధ ఎరువులు అందించాలి.
Image credits: Getty
Telugu
ప్రయోజనాలు
మల్లె ఆయిల్ నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేస్తుంది. మనశ్శాంతిని అందిస్తుంది. మానసిక స్థితి, మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.