Water Plants: మట్టి లేకుండా పెరిగే మొక్కలు.. ఇంటిని అందంగా మార్చుకోండి
Telugu

Water Plants: మట్టి లేకుండా పెరిగే మొక్కలు.. ఇంటిని అందంగా మార్చుకోండి

స్నేక్ ప్లాంట్
Telugu

స్నేక్ ప్లాంట్

మట్టిలో పెరిగే స్నేక్ ప్లాంట్ నీటిలో కూడా పెరుగుతుంది. దెబ్బతినని ఆకును కత్తిరించి పెద్ద జార్ లో ఉంచి, నీటిని పోస్తే చాలు. దీనివల్ల ఇంట్లో మనం పీల్చుకునే గాలి శుభ్రంగా మారుతుంది. 

స్పైడర్ ప్లాంట్
Telugu

స్పైడర్ ప్లాంట్

పెరగడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకునే మొక్క ఇది. మొక్క ఆకును కత్తిరించి నీటితో నిండిన గ్లాసులో ఉంచితే చాలు. సులభంగా పెరుగుతుంది. దీని వల్ల మీ ఇంటికి ఓ ప్రత్యేక కళ వస్తుంది.  

స్ప్రింగ్ ఆనియన్
Telugu

స్ప్రింగ్ ఆనియన్

చాలా చిన్న స్థలంలో స్ప్రింగ్ ఆనియన్ ను పెంచవచ్చు. వేర్లు నీటిలో ఉంచడం, కనీసం 4 గంటలు ఎండలో ఉంచడం చాలా ముఖ్యం. ఇవి  కొద్దిగా వెచ్చని వాతావరణం ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి.

Telugu

పోథోస్

దీనినే మనీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది చాలా సులభంగా పెరుగుతుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల  అదృష్టమని, సంపదలు చేకూరుతాయని చాలా మంది నమ్ముతారు. 

Telugu

పుదీనా

పుదీనా అత్యంత తేలికగా పెరిగే ఔషధ మొక్కలలో ఒకటి. దీని ఆకుల నుంచి వచ్చే తీయటి సువాసన వంటకాల రుచిని మార్చేస్తాయి. ఈ మొక్క వేర్లు నీటిలో మునిగి ఉండేలా ఉంచితే చాలు సులభంగా పెరుగుతుంది. 

Telugu

కలబంద

సంవత్సరాల తరబడి పెరిగే మొక్క ఔషధ మొక్క కలబంద. వేర్లు పెరగకపోయినా ఆకులు నీటిలో బాగా పెరుగుతుంది. 

Telugu

లక్కీ బాంబూ

మట్టి లేకుండానే సులభంగా పెరిగే మొక్క లక్కీ బాంబూ. ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో పెడితే చాలు. సులభంగా పెరుగుతుంది. ఈ ఇంటిని ప్రత్యేకంగా మార్చుతుంది.  

వర్షాకాలంలో పాములు రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

పెంపుడు జంతువులకు ఇవి అస్సలు పెట్టకండి: ప్రాణం కూడా పోవచ్చు

ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు రానే రావు!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?