Telugu

Poisonous plants: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా? చాలా డేంజ‌ర్ అంట..

Telugu

స్నేక్ ప్లాంట్

ఇంట్లో పెంచుకునే మొక్క స్నేక్ ప్లాంట్. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. కానీ దాని ఆకులు విషపూరితమైనవి. దీని తినడం వల్ల వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు తలెత్తవచ్చు.

Telugu

అమరన్

అమరన్ లో పుప్పొడి ఎక్కువ. దీని వల్ల అలెర్జీలు రావచ్చు. తుమ్ములు, ముక్కు కారడం, గొంతులో దురద, కళ్లలో దురద, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. 

Telugu

ఇంగ్లీష్ ఐవీ

ఇంగ్లీష్ ఐవీ (Hedera helix)  మొక్క గాలిని శుద్ధి చేయడంలో,  శ్వాసకోశ సమస్యలకు చికిత్సకు ఉపయోగపడుతుంది. కానీ,  దీనిని తాకడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు,  

Telugu

పోథోస్

సులభంగా పెరిగే మొక్క పోథోస్. అందరినీ ఆకర్షించే  ప్రమాదకరమైన మొక్క. వీటి ఆకులలో కరగని కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఉంటాయి. ఇవి హానికరం. 

Telugu

పీస్ లిల్లీ

చాలా ఇళ్లలో పీస్ లిల్లీ పెంచుకుంటారు. కానీ దీని ఆకులు, పువ్వులకు పిల్లలను దూరంగా ఉంచండి.  

Telugu

కలేడియం

ఆకులు పెద్దగా ఉండే ఈ మొక్కలో విషపూరితమైన క్యాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఉంటాయి. ఇవి పిల్లలకు, పెంపుడు జంతువులకు హానికరం. 

Telugu

ఫిలోడెండ్రాన్

ఇందులో హానికరమైన క్యాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఉంటాయి. కాబట్టి ఫిలోడెండ్రాన్ పెంచుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

Water Plants: మట్టి లేకుండా పెరిగే మొక్కలు.. ఇంటిని అందంగా మార్చుకోండి

వర్షాకాలంలో పాములు రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

పెంపుడు జంతువులకు ఇవి అస్సలు పెట్టకండి: ప్రాణం కూడా పోవచ్చు

ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు రానే రావు!