Food
వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ బాగా ఎర్రగా, జ్యూసీగా ఉన్న పుచ్చకాయలు ఆరోగ్యానికి హానికరం. వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం.
ఒక తెల్లటి కాటన్ క్లాత్ తో పుచ్చకాయ గుజ్జును రుద్దండి. వస్త్రంపై ఎరుపు రంగు వస్తే, అది కృత్రిమ రంగులకు సంకేతం.
పుచ్చకాయ ముక్కను ఒక గ్లాసు నీటిలో వేయండి. నీరు రంగు మారి లేత గులాబీ రంగులోకి మారితే.. పుచ్చకాయలో కల్తీ ఉందని అర్థం.
కొంతమంది పుచ్చకాయను తియ్యగా చేయడానికి షుగర్ సొల్యూషన్ ఇంజెక్ట్ చేస్తుంటారు. పుచ్చకాయ పై చిన్న పిన్ హోల్స్ లేదా గుంటలు ఉన్నాయో జాగ్రత్తగా చెక్ చేయండి
కొన్నిసార్లు పుచ్చకాయ బరువు దాని పరిమాణానికి మించి ఉంటుంది. ఇది నీరు లేదా కెమికల్ ఇంజెక్షన్ చేసినట్లు సూచిస్తుంది.
పుచ్చకాయ గుజ్జు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. రంగు చాలా ఎరుపు లేదా మెరిసేలా ఉంటే, రంగు కలిపి ఉండవచ్చు.
పుచ్చకాయలో కలిపే ప్రమాదకర కెమికల్స్ వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి రావచ్చు.
ఎక్కువ కాలం కల్తీ పుచ్చకాయ తింటే లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. జీర్ణవ్యవస్థ కూడా బలహీనపడవచ్చు.