Food
సాధారణంగా కోడి మాంసాన్ని ఇష్టంగా తినే వారు కూడా దాని కాళ్లను మాత్రం అస్సలు ముట్టుకోరు.
ఎందుకంటే కోడి కాళ్లలో మాంసం ఉండదు. కేవలం ఎముక మాత్రమే ఉంటుంది. దీన్ని కొరికి తినడం కష్టంగా ఉంటుంది కాబట్టే దీన్ని పక్కన పెట్టేస్తుంటారు.
అయితే కొంతమంది కోడి కాళ్లను డీప్ ఫ్రై లేదా సూప్ గా చేసుకుని తింటుంటారు. కానీ చాలా మందికి నచ్చని కోడి కాళ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కోడి కాళ్లలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మోకాళ్లకు చాలా మంచిది. ఎముకల అరుగుదలను ఇది తగ్గిస్తుంది.
100 గ్రాముల కోడి కాళ్లలో, 240 గ్రాముల కేలరీలు, 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
కోడి కాళ్లలో ఎన్నో రకాల విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని కొరికి తినడం పళ్లకు మంచిది. అందుకే ఇకపై కోడి కాళ్లను పనికిరావని పారేయకుండా తినండి.