Food
కోడిగుడ్డు తింటే కొలిస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భయపడతారు. కానీ, గుడ్డులో ప్రోటీన్లు, యాంటీ యాక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గాలి అనుకునేవారు తమ డైట్ లో కోడిగుడ్డు చేర్చుకోవచ్చు. ఒక్క గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గుడ్డు పచ్చసొనలో కొలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వాపును తగ్గించడానికి, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
రోజూ రెండు గుడ్లు తినడం మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది.
విటమిన్ డి, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలకు బలాన్నిస్తుంది.
విటమిన్ సి, ఇ, ల్యూటిన్ లకు మంచి మూలం గుడ్డు. కంటి చూపు మెరుగుపరచడానికి, మాక్యులర్ డిజెనరేషన్ ను నివారించడానికి గుడ్డు సహాయపడుతుంది.