Food
అసలు చక్కెర కాకుండా.. బెల్లం తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్తం లోపంతో బాధపడేవారికి బెల్లం మంచి మేలు చేస్తుంది. బెల్లాన్ని తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది. ఇందుకోసం రోజూ ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని లేదా ఒక చిన్న ముక్కను తినండి.
అలసటను పోగొట్టడానికి కూడా బెల్లం సహాయపడుతుంది. ఇందుకోసం మీకు అలసటగా అనిపించినప్పుడు ఒక ముక్క బెల్లం ముక్కను తినండి. శక్తి అందుతుంది.
బెల్లంలో విటమిన్లు,ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. బెల్లాన్ని రోజూ కొద్దిగా తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు.
ఐరన్ లోపం ఉన్నవారికి కూడా బెల్లం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినడం మంచిది.
బెల్లం శరీరంలోని, కాలేయంలోని విషాన్ని బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాలేయాన్ని శుద్ధి చేయడానికి సహాయపడే జింక్, యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి ఖనిజాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.
బెల్లం పీరియడ్స్ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.