ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే సోడియం, సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.
బీఫ్, పంది మాంసం, మటన్ వంటి రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ పెంచుతాయి.
నూనెలో వేయించిన ఆహారాల్లో సంతృప్త కొవ్వు అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ప్యాక్ చేసిన ఆహారాలతో కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ.
పేస్ట్రీ, కేక్, కుకీస్ వంటి వాటిలో కొవ్వు, చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి.
ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.