Food
మొలకెత్తిన పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.
డయాబెటీస్ ఉన్నవారు శెనగలను ఉడికించి తినడం చాలా మంచిది. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్లకు రాత్రిపూట మంచి స్నాక్స్.
బ్లూబెర్రీలు కూడా మధుమేహులకు చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
షుగర్ పేషెంట్లకు చిలగడదుంపలు చాలా మంచివి. ఫైబర్ పుష్కలంగా ఉన్న వీటిని ఉడికించి రాత్రిపూట తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
డయాబెటీస్ ఉన్నవారికి ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఉన్న బాదం, వాల్ నట్స్ వంటి గింజలు చాలా మంచివి. ఇవి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.
డయాబెటీస్ ఉన్నవారు రాత్రిపూట క్యారెట్, బెల్ పెప్పర్, కీరదోసకాయ, బ్రోకలీ ఉన్న వెజ్ సలాడ్ ను తినాలి. ఇవి షుగర్ పెరగకుండా చేస్తాయి.