Food
ఆలుగడ్డలు మన ఆరోగ్యానికి మంచివా? కావా? అన్న విషయంపై.. వాటిలోని పోషక విలువల చార్ట్‌ను న్యూట్రిషన్ నిపుణుడు ప్రశాంత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
100 గ్రాముల ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో జస్ట్ 93 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. తొందరగా ఆకలి కాదు.
100 గ్రాముల ఫ్రెంచ్ ఫ్రైస్‌లో సుమారుగా 350 కేలరీలుంటాయి. వీటిని నూనెలో వేయించడం వల్ల వాటిలో చక్కెర, కార్బోహైడ్రేట్ల లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు.
100 గ్రాముల ఆలుచిప్స్ లో దాదాపుగా 550 కేలరీలుంటాయి. అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డల కంటే 5 రెట్లు ఎక్కువ కేలరీలు, షుగర్ కంటెంట్ ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని పెంచుతాయి.
ఉడకబెట్టిన ఆలుగడ్డలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ మీకు తొందరగా ఆకలి అయ్యేలా చేస్తాయి. వీటిని తింటే మీ బరువు బాగా పెరుగుతుంది.
ఆలు చిప్స్, ఫ్రైస్‌లతో పోలిస్తే ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తో పోలిస్తే ఉడికించిన ఆలుగడ్డలే ఆరోగ్యానికి మంచివి. వీటిని తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎక్కువగా మాత్రం తినకూడదు.