Food
పాలలో ఖనిజాలు, ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక యాలకులలో పొటాషియం, విటమిన్ సి, ఇనుము, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
పాలు, యాలకులలో ఉండే పోషకాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. కాబట్టి చలికాలంలో పాలలో యాలకులను కలిపి తాగితే సీజనల్ వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి కూడా యాలకుల పాలు బాగా ఉపయోగపడతాయి. యాలకులు కలిపిన పాలను తాగితే మీరు త్వరగా బరువు తగ్గుతారు.
నిద్రలేమి సమస్యను తగ్గించడానికి యాలకులు కలిపిన పాలు బాగా ఉపయోగపడతాయి. ఈ పాలను తాగితే రాత్రిపూట మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది.
చలికాలంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి యాలకులు కలిపిన పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పాలు తాగితే మోషన్స్ సాఫీగా అవుతాయి.
చలికాలంలో జీర్ణ సమస్యలు చాలా మందికి వస్తాయి. ఇలాంటి వారు యాలకులు కలిపిన పాలను తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వయసు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.