ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది
రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మరసం తాగితే జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: Freepik
Telugu
కాలేయ ఆరోగ్యానికి మంచిది
లెమన్ వాటర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీంతో కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
లెమన్ వాటర్ మనం ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే పెక్టిన్ మన ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.
Image credits: Freepik
Telugu
చర్మం కాంతివంతంగా ఉండటానికి
నిమ్మరసం మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు తగ్గుతాయి. అలాగే ముఖం కాంతివంతంగా అవుతుంది.
Image credits: Freepik
Telugu
నిమ్మరసం
లెమన్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.